నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

Today is the JEE Advance Exam - Sakshi

తెలంగాణ నుంచి హాజరుకానున్న 8,450 మంది విద్యార్థులు

వచ్చేనెల 14న ఫలితాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించేందుకు ఐఐటీ రూర్కీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.45లక్షల మందికి అర్హత కల్పించినా కేవలం 1.80 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేలమంది అర్హత సాధించిన అడ్వాన్స్‌డ్‌కు కేవలం 18 వేలమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి 8,450 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షను సోమవారం రెండు విడతల్లో పరీక్ష నిర్వహించేలా ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్షను, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌– 2 పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరని, విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెంట పెన్నులు, పెన్సిళ్లు, హాల్‌టికెట్లు, ఐడీ కార్డు తెచ్చుకోవాలని పేర్కొంది. ఇక ఈ పరీక్ష ఫలితాలను/ర్యాంకులను వచ్చే నెల 14న విడుదల చేస్తామని ప్రకటించింది.

ఇదీ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూలు 
- 27–5–2019: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 
29–5–2019 నుంచి 1–6–2019 వరకు: అభ్యర్థులకు వారి రెస్పాన్స్‌షీట్లు పంపిణీ 
4–6–2019: వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ‘కీ’ 
4–6–2019 నుంచి 5–6–2019 వరకు: ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ 
14–6–2019 ఉదయం 10 గంటలకు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడి 
14–6–2019 నుంచి 15–6–2019 వరకు: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ 
17–6–2019: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 
21–6–2019 సాయంత్రం: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఫలితాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top