వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

three Died In Road Accident  - Sakshi

బల్మూర్‌ (అచ్చంపేట) : ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాత్రి సమయంలో ఎద్దు అడ్డు రావడంతో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన   మండలంలోని కొండనాగుల సమీపంలో అచ్చంపేట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ విక్రం కథనం ప్రకారం.. కొండనాగులకు చెందిన వలూవాయి నర్సింహ(40) రామాజిపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ ఊశయ్య కలిసి శని వారం రాత్రి ద్విచక్రవాహనంపై రామాజిపల్లికి వెళ్తున్నారు.

మార్గమధ్యలోని రైస్‌మిల్‌ వద్ద రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఎద్దును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనక కూర్చున్న నర్సింహ తలకు తీ వ్ర గాయాలు, ఊశయ్య బలమైన గాయాలయ్యా యి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తర లిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.

ఊ శయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హై దరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై నర్సింహ భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నర్సింహ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థికసాయం అందజేశారు. 

సైకిల్‌పై నుంచి కిందపడి.. 

బల్మూర్‌ (అచ్చంపేట): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆదినారాయణ(45) సైకిల్‌పై వెళ్తుండగా పశువులను ఢీకొనడంతో  కిందపడి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఆదినారాయణ తాపీ మేస్త్రీ పని కోసం తన సైకిల్‌పై కొండనాగులకు వెళ్తుండగా గ్రామ స్టేజీ సమీపంలో పశువులను ఢీకొట్టి కింద పడిపోయాడు.

గమనించిన బాటసారులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. సంఘటనపై ఆదినారాయణ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

గుర్తుతెలియని రైలు ఢీకొని.. 

మాగనూర్‌ (మక్తల్‌): మండలంలోని చేగుంట రైల్వేస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని కర్ణాటకలోని యాద్గీర్‌ పట్టణానికి చెందిన రమేష్‌(38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వర్‌రావ్‌ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top