కార్మికుల సంక్షేమమే ధ్యేయం | The welfare of workers aims telangana governament | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

Feb 27 2017 12:50 PM | Updated on Aug 11 2018 4:59 PM

కార్మికుల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు.

► మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
► ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ నారదాసు


కరీంనగర్‌: బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మికుల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. ఆదివారం పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో గల ఎల్లమ్మ గుడి వద్ద  ఆల్‌ టూవీలర్‌ మెకానిక్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు.

మెకానిక్‌ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లుతానని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. మెకానిక్‌లకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు కార్మిక సంక్షేమ శాఖ నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంతో పాటు హెల్త్‌కార్డులు అందేలా చొరవ చూపుతానన్నారు. మెకానిక్‌ల కమ్యూనిటీ హాల్‌ కోసం ఇప్పటికే 3 లక్షలు కేటాయించానని, భవన నిర్మాణం చేపడితే ఎమ్మెల్యే కోటా నిధుల  నుంచి మరో 30 లక్షల రూపాయల కేటాయిస్తానని హమీ ఇచ్చారు.

కార్యక్రమంలోనగర మేయర్‌ రవీందర్‌సింగ్, ఆల్‌ టూవీలర్స్‌ మెకానిక్‌ వెల్పేర్‌ సోసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు, గౌరవ అధ్యక్షుడు గజ్జెల స్వామి, కార్పొరేటర్లు ఎల్‌.రూప్‌సింగ్, కంసాల శ్రీనివాస్, మహ్మద్‌ అరీఫ్, మాజీ కార్పొరేటర్‌ పడిశెట్టి భూమయ్య, ఏఎంసీ చైర్మన్‌ ముల్కల గంగారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె ఖాజా అలీమొద్దీన్, ఎండీ అఫ్రోజ్, మల్లిఖార్జున్, వినోద్‌కుమార్, శ్రీను, నరేశ్, ఆంజనేయులు, ముజాహిద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున మెకానిక్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement