కొత్త కార్డులకు బియ్యం వచ్చేనా..? | Sakshi
Sakshi News home page

కొత్త కార్డులకు బియ్యం వచ్చేనా..?

Published Sun, Oct 19 2014 3:43 AM

కొత్త కార్డులకు బియ్యం వచ్చేనా..?

సాక్షి, మహబూబ్‌నగర్ :
 నవంబర్ నుంచి కొత్త రేషన్‌కార్డులకు కొత్త పంథాలో బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున.. గరిష్టంగా 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారు. కానీ కొత్త కార్డులపై ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో బియ్యం కోటా పెరిగే అవకాశముంది. అయితే మరోవైపు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) సరఫరా చేయడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు మీద గడువులు విధించినా వారి నుంచి స్పందన ఉండడం లేదు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినా పట్టింపులు లేవు. చివరాఖరుగా ప్రభుత్వమే అ క్టోబర్ 30నాటికి బియ్యం అందజేయాలని తా జాగా గడువు విధించింది. ఈ గడువు కూడా సమీపిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్డులకు బియ్యం సరఫరా, మిల్ల ర్ల నుంచి రాబట్టడంపై పౌరసరఫరాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

 మిల్లర్ల ఇష్టారాజ్యం...
 ఈ ఏడాది మార్చిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోని మిహ ళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగో లు చేశారు. పౌరసరఫరాల శాఖలో తగిన సిబ్బంది లేరని, ఇతరత్రా కారణాల చేత మహి ళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 61,308.439 టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని జిల్లాలోని దాదాపు 45 రైస్‌మిల్లులకు సరఫరా చేశారు.

స్వీకరించిన ధాన్యంలో దాదాపు 68శాతం అంటే 41,689.738 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి స రఫరా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా కేవలం 14 రోజుల్లోనే మిల్లర్లకు ఆదేశాలున్నాయి. మొ త్తం మీద జూన్ మొదటి వారం నాటికి పూర్తి స్థాయిలో బియ్యం అందజేయాల్సి ఉండేది. గడువుల మీద గడువులు విధిస్తూ ఆఖరుకు సెప్టెంబర్ 30 నాటికి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు కూడా ఆ లక్ష్యం నెరవేరడం లేదు.

సెప్టెంబర్ 30 నాటికి కేవలం 32శాతం బియ్యం మాత్రమే మిల్లర్ల నుంచి రావడంతో జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని రంగంలోకి దిగి క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. అనంతరం చివరాఖరు అవకాశంగా అక్టోబర్ 30నాటికి పూర్తిస్థాయిలో ఇవ్వాలని మిల్లర్లకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

 ఇంకా 25.71శాతం బకాయి..
  నాలుగు నెలలుగా మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆఖఱు అవకాశమిచ్చిన ప్రభుత్వం అందుకు పక్కా చర్యలు తీసుకుంది. ధాన్యం బాకీ ఉన్న మిల్లర్ల నుంచి బయట మార్కెట్ బియ్యం వెళ్లకుండా చూ సేందుకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 20వ తేదీన 15 మంది అ దికారులను నియమించింది.

మొత్తం మిల్లర్ల నుంచి 41,689.738 టన్నుల బియ్యం రావాల్సిఉండగాఇప్పటి వరకు 30,919.403 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది. ఇంకా 10,770.335 మె ట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీపావళి సెలవులు పోను తుది గడువుకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అతి కొద్ది కాలంలో మిల్లర్ల నుంచి ఎలా రాబట్టాలోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement