బాలశ్రీ అవార్డు ప్రదర్శనకు విద్యార్థులు | The award presentation balasri six students | Sakshi
Sakshi News home page

బాలశ్రీ అవార్డు ప్రదర్శనకు విద్యార్థులు

Apr 8 2016 3:24 AM | Updated on Sep 3 2017 9:25 PM

బాలశ్రీ అవార్డు ప్రదర్శనకు విద్యార్థులు

బాలశ్రీ అవార్డు ప్రదర్శనకు విద్యార్థులు

జాతీయ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి బాలశ్రీ అవార్డు కోసం నిర్వహించే వివిధ ప్రదర్శనలకు జిల్లాకు....

మే 1న ఢిల్లీకి వెళ్లనున్న విద్యార్థులు
 
గద్వాల : జాతీయ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి బాలశ్రీ అవార్డు కోసం నిర్వహించే వివిధ ప్రదర్శనలకు జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ఉప విద్యాశాఖాధికారి మిరాజుల్లాఖాన్, గద్వాల బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాల్లో ప్రతిభచూపిన విద్యార్థులను బాలశ్రీ అవార్డులకు ఎంపికచేసినట్లు వివరించారు. సృజనాత్మక నృత్య ప్రదర్శనలో వనపర్తికి చెందిన చైత్రారెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌తేజ, సృజనాత్మక శిల్పకళా ప్రదర్శనలో వనపర్తికి చెందిన చేయూత అనాథాశ్రమానికి చెందిన విద్యార్థి ప్రశాంత్  ఎంపికయ్యారు.


వీరితో పాటు సృజనాత్మక విజ్ఞానం ప్రాజెక్టు విభాగంలో గద్వాల విశ్వేశ్వరయ్య స్కూల్‌కు చెందిన మాధవన్, సృజనాత్మక మాడల్ మేకింగ్ విభాగంలో ధరూరు మండలం ఉప్పేరు జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆంజనేయులు, సృజనాత్మక ఇన్నోవేషన్ విభాగంలో వనపర్తికి చెందిన వంశీధర్‌గౌడ్ ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ ఆరుగురు విద్యార్థులు ఆయా విభాగాల్లో మే 3,4 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి బాలశ్రీ అవార్డు పోటీల కోసం తమ ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. ఫైనల్ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి బాలశ్రీ అవార్డును కైవసం చేసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఎంపిక పట్ల వారు అభినందనలు తెలిపారు. మే 1వ తేదీన విద్యార్థులు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement