వేటకొడవలితో యువతిపై దాడి | The attack woman in women hostel | Sakshi
Sakshi News home page

వేటకొడవలితో యువతిపై దాడి

May 19 2015 2:09 AM | Updated on Sep 3 2017 2:17 AM

వేటకొడవలితో యువతిపై దాడి

వేటకొడవలితో యువతిపై దాడి

ప్రేమించమని ఓ యువతిని ప్రేమోన్మాది కొద్దికాలంగా వేధిస్తున్నాడు.

మహిళా హాస్టల్‌లో యువకుడి ఘాతుకం
హైదరాబాద్: ప్రేమించమని ఓ యువతిని ప్రేమోన్మాది కొద్దికాలంగా వేధిస్తున్నాడు. అం దుకు యువతి నిరాకరించడంతో ఆమెను హతమార్చేందుకు నగరానికి వచ్చా డు. యువతి డ్యూటీకి వెళ్లడంతో ఆమె గదిలో ఉన్న మరో యువతిని కొడవలితో నరికిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శ్రావణ్ అలియాస్ చరణ్ తన ఊరికే చెందిన సమీపబంధువు చెతన్యను ప్రేమించాలని వెం టపడేవాడు. అందుకు యువతి నిరాకరించడం తో కోపం పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన శ్రావణ్ సోమవారం మధ్యాహ్నం యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. చైతన్య తనకు చెల్లి అవుతుందని, ఆమెను పిల వాలని వాచ్‌మెన్‌కు చెప్పాడు. చైతన్య డ్యూటీకి వెళ్లిందని చెప్పడంతో ఆమె గదిలోనే ఉండి వచ్చిన తర్వాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వాచ్‌మెన్ కళ్లుగప్పి నేరుగా చైతన్య ఉండే గదిలోకి వెళ్లాడు. అయితే గదిలో చైతన్య రూంమేట్ మమత ఉంది. తాను వేసిన పథకానికి మమత అడ్డొస్తుందని భావించి తన వెంట తీసుకొచ్చిన వేటకొడవలితో ఆమె తలపై వేటువేశాడు.

అతడి నుంచి తప్పించుకుని మమత అరుస్తూ గది నుంచి బయటకు రావడాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది శ్రావణ్‌ను పట్టుకున్నారు.  గాయపడిన మమతను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మమత స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. ఆమె ఈసీఐఎల్‌లోని ఓ కంపనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. మమత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement