నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ | telangana the krishna board today met the three member committee | Sakshi
Sakshi News home page

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

Mar 2 2018 4:45 AM | Updated on Mar 2 2018 4:45 AM

telangana the krishna board today met the three member committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, ఇరు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం మధ్యాహ్నం జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న 36 టీఎంసీల జలాల్లో ఏపీ కోటా పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావులు హాజరు కానున్నారు. లభ్యత జలాల నుంచే సర్దుబాటు చేయడమా.. లేక కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని తోడటమా అనే దానిపై భేటీలో చర్చించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement