గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్‌

Telangana government To Host Dinner For Ivanka reached Golconda Fort  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె  ఇవాంకా ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్‌కు హాజరైన ఇవాంకా ట్రంప్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. ఈ రోజు ఉదయం సమిట్లో సెషన్లకు హాజరైన ఆమె తర్వాత చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రత మధ్య ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు విచ్చేశారు. అక్కడ ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఇవాంకా వెంట తెలంగాణ సీఎస్ కూడా ఉన్నారు.

జీఈఎస్‌కు హాజరయిన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. అంతకు ముందు యూఎస్‌ సీక్రెట్‌ ఏజెంట్స్‌ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు  పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట పరిధిలో రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సందర్శకులను లోనికి అనుమతించడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top