మండలి ఎన్నికలకు కొత్త జాబితా

Telangana Council Elections List Ready - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శాసనమండలి ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జాబితాపై సెప్టెంబర్‌ 2016లోనే రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. దీంతో పాత ఓటర్ల జాబితా పూర్తిగా రద్దయింది. మరో 6 నెలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎన్నిౖMðన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుండటం, ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో వచ్చే నెలలో ఓటర్ల న మోదుకు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలున్నాయి.  

ఫిబ్రవరిలోనే ప్రక్రియ పూర్తి 
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిౖMðన శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ పదవీకాలం వచ్చే ఏడాది పూర్తవనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కూడా రిటైర్‌అవుతున్నారు. ఈ స్థానాలకు జనవరి లేదా ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.  

కొత్తగా నమోదు చేసుకుంటేనే.. 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కొత్తగా నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది. ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి మూడేళ్లు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలి.  కొత్తగా ఓటర్ల నమోదు చేసుకోవా లని వచ్చే నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరులో ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది.  

స్వామిగౌడ్‌ అనాసక్తి!  
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్‌ పోటీచేయడానికి అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన తాను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తానని ఆయన విశ్వాసంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు చంద్రశేఖర్‌గౌడ్‌ సన్నిహితులు చెబుతున్నారు. కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, కార్పొరేషన్‌ చైర్మన్‌ చిరుమిళ్ల రాకేశ్‌కుమార్‌ పేర్లు కూడా టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ పేరూ టీఆర్‌ఎస్‌ పరిశీలించే అవకాశం లేకపోలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top