మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు.
బల్మూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. అంబగిరికి చెందిన కృష్ణానాయక్(48) తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో బల్మూరు మండలం కొండనాగుల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.
కృష్ణానాయక్ రామాజిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం పిల్లల చదువుల కోసం అచ్చంపేటలో నివాసం ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.