krishna nayak
-
రోడ్డుప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
బల్మూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. అంబగిరికి చెందిన కృష్ణానాయక్(48) తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో బల్మూరు మండలం కొండనాగుల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. కృష్ణానాయక్ రామాజిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం పిల్లల చదువుల కోసం అచ్చంపేటలో నివాసం ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ హెడ్మాస్టర్ మాకొద్దు
‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెడ్మాస్టర్ విలువలు మరచి ప్రవరిస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. మేము ఆడపిల్లలమే కాని ఆటబొమ్మలం కాము. మాతో అసభ్యంగా ప్రవరిస్తున్నారు. పాఠశాలకు రావాలంటేనే భయమేస్తోంది. ఈ హెచ్ఎం మాకొద్దు. ఆయన ఉంటే పాఠశాలకు రాం.’పులివెందులలోని రవీంద్రనగర్ పాఠశాల విద్యార్థినుల ఆవేదన ఇది. పులివెందుల టౌన్: పులివెందులలోని రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణానాయక్ సార్ మా కొద్దంటూ బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్న హెడ్మాస్టర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకెళితే.. పులివెందుల పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ వద్ద ఉన్న రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్గా కృష్ణానాయక్ ఈ ఏడాది మే 24న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన చక్రాయపేట మండలం మహదేవపల్లి జెడ్పీ పాఠశాలలో పలు ఆరోపణలతో సస్పెండయ్యారు. అనంతరం కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు ఈయన ర వీంద్రనాథ పాఠశాలకు హెడ్మాస్టర్గా వచ్చారు. ఆయన తీరులో ఏమాత్రం మార్పులేదని.. తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు వచ్చి హెడ్మాస్టర్ను అడిగినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నిత్యం నరకం అనుభవించలేక ఆందోళనకు దిగామని వారు చెప్పారు. హెడ్మాస్టర్ డౌన్ డౌన్.. ఈ హెడ్మాస్టర్ మాకొద్దు..ఆయన ఉంటే పాఠశాలకు రామంటూ ఫ్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. ఎంఈవో విలియం రాజు విచారణ : హెడ్మాస్టర్ కృష్ణానాయక్ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఎంఈఓ విలియం రాజు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ హెడ్మాస్టర్ ఉంటే తాము పాఠశాలకు రామని విద్యార్థులు తెగేసి చెప్పారు. దీంతో ఆయన ఈ విషయాన్ని డీఈఓకు ఫోన్ ద్వారా వివరించారు. హెడ్మాస్టర్ను వివరణ కోరగా తనకెలాంటి పాపం తెలియదన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా హెడ్మాస్టర్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. అలాగే రాయచోటి అసిస్టెంట్ డీఈఓ రంగారెడ్డి కూడా బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆడపిల్లలమా.. ఆటబొమ్మలమా పాఠశాలకు చదువుకొనేందుకు వస్తున్నాము, మా హెడ్మాస్టర్ మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మేము ఆడపిల్లలమా లేక ఆటబొమ్మలం అనుకున్నారా. గురువంటే తండ్రితో సమానం. ఇలాంటి వారు పాఠశాలలో ఉంటే మే ము ఎట్లా చదువుకోవాలి..మాకు పాఠశాలకు రావాలంటేనే భయంగా ఉంది. ఈ హెడ్మాస్టర్ను ఇక్కడి నుంచి పంపిం చాల్సిందేనని విద్యార్థులు తమ ఆవేదనను అధికారుల ఎదుట వ్యక్తం చేశారు. -
ఈ హెడ్మాస్టర్ మాకొద్దు
చక్రాయపేట, న్యూస్‌లైన్: ఈ హెడ్మాస్టర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఇతను మాకొద్దు అంటూ మండలంలోని మహదేవపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్‌ను రెండు నెలలుగా వేధింపులకు గురిచేయడమే కాకుండా శనివారం ఆమెపట్ల ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్ అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆదివారం బైఠాయించారు.దీంతో రాయచోటి-వేంపల్లె ప్రధాన రహదారిలో సుమారు 5గంటల పాటు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తహశీల్దారు నాగేశ్వరరావు, డిప్యూటీ డీఈవో రంగారెడ్డి,ఎంఈవో రవిశంకర్ సర్దిచెప్పినా వినలేదు. డీఈవో వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు డీఈవో వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పినా వినిపించుకోలేదు. మీమపై నమ్మకం లేదు..సస్పెండ్ చేశామని చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. డీఈవో తహశీల్దారు కార్యాలయంలో కూర్చొని ఉన్నవిషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయన ఉన్న గదికి తాళం వేసి నినాదాలు చేశారు. తమను సారాప్యాకెట్లు తెమ్మంటున్నాడని, ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. తమను మోకాళ్లపైకే దుస్తులు వేసుకోమంటున్నాడని బాలిక లు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని హెడ్మాస్టర్ను వదిలేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓపై మండిపడ్డారు. ఆర్జేడీకి సమాచారం అందించి సోమవారం ఉదయం సస్పెండ్ ఆర్డర్స్ ఇస్తామని డీఈఓ చెప్పినా విద్యార్థులు వినలేదు. సప్పెండ్ ఆర్డర్ ఇచ్చారనే విషయం తమకు తెలిసే వరకూ పాఠశాల తలుపులు తెరిచేది లేదని తేల్చిచెప్పారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు 2009 నుంచి కృష్ణనాయక్ చేస్తున్న వేధింపులపై విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,యూత్ కన్వీనర్ వెంకట సుబ్బయ్య,సింగిల్ విండో అధ్యక్షుడు శేషారెడ్డి,మాజీ రెస్కో చైర్మన్ శివప్రసాద్‌రెడ్డి, బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి డీఈవో అంజయ్యను నిలదీశారు. హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని యేడాదిన్నర్ర క్రితం విజిలెన్స్ వారు ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యార్థులు చేసిన ఆందోళనలు,వారి ఆరోపణలతో పాటు అప్పటి డిప్యూటీ డీఈవో సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికలు సుమారు వంద పేజీలతో కూడిన ఆరోపణలను డీఈవోకు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌పై పాఠశాల మహిళా టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. రెండు నెలలుగా తనను వేధిస్తున్నాడని, శనివారం తన గొంతు పట్టి నొక్కాడని చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అంతేగాక కృష్ణానాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ కేసు నమోదుచేయాలి బాలికలని చూడక తాళాలతో పొడుస్తాడు. ఈయన వేధింపులు భరించ లేకున్నాం. టీచర్లపైనే ఇలా ప్రవ ర్థిస్తే మా పరిస్థితి ఏమిటి. ఈయన ఉపాధ్యాయ వృత్తికే అనర్హుడు. నిర్భయ కేసు నమోదు చేస్తేనే గుణపాఠం వస్తుంది. - నందిని, విద్యార్థి