మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత | Swarnalatha Bhavishyavani In Ujjaini Bonalu | Sakshi
Sakshi News home page

మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత

Jul 22 2019 10:45 AM | Updated on Jul 22 2019 11:04 AM

Swarnalatha Bhavishyavani In Ujjaini Bonalu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. 

‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement