పేద కుటుంబానికి ఆపన్న హస్తం | Support to the poor | Sakshi
Sakshi News home page

పేద కుటుంబానికి ఆపన్న హస్తం

Aug 13 2015 2:40 AM | Updated on Sep 3 2017 7:19 AM

రామంచ గ్రామానికి చెందిన నిరుపేద జంగపల్లి నర్సింలు కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు

స్పందించిన మంత్రి హరీష్‌రావు
ఎంపీపీ, ఓఎస్‌డీల ద్వారా ఆర్థిక సాయం
 
 చిన్నకోడూరు : రామంచ గ్రామానికి చెందిన నిరుపేద జంగపల్లి నర్సింలు కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో భార్య అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న వైనంపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు. వెంటనే ఓఎస్‌డీ బాల్‌రాజు, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డిలను ఆ కుటుంబ పరిస్థితులను పరిశీలించమని ఆదేశించారు. వారు బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి నర్సింలు భార్య పద్మకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. నర్సింలుకు వైద్యం అందించడం తోపాటు మందులు ఉచింతంగా అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ఉన్నత చదువుకు సహకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement