ట్రైనీ ఐఏఎస్‌ల కేటాయింపులపై స్టేటస్‌కో | status co on ias officers division | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐఏఎస్‌ల కేటాయింపులపై స్టేటస్‌కో

Jan 2 2015 3:01 AM | Updated on Sep 27 2018 3:20 PM

శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు తుమ్మల సృజన, శివశంకర్‌లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

సాక్షి, హైదరాబాద్: శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు తుమ్మల సృజన, శివశంకర్‌లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

చిత్తూరు, విజయనగరం జిల్లాలకు చెందిన తమను ఆంధ్రప్రదేశ్‌కు కాకుండా తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లుగా(ట్రైనీ) పనిచేస్తున్న సృజన, శివశంకర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. సొంత జిల్లాలను శాశ్వత నివాసంగా తీసుకొని తమను ఏపీలో కొనసాగించాల్సి ఉన్నా... అందుకు విరుద్ధంగా తెలంగాణకు కేటాయించారని పిటిషనర్లు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement