breaking news
status co
-
ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై) వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) -
ట్రైనీ ఐఏఎస్‌ల కేటాయింపులపై స్టేటస్కో
సాక్షి, హైదరాబాద్: శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు తుమ్మల సృజన, శివశంకర్లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. చిత్తూరు, విజయనగరం జిల్లాలకు చెందిన తమను ఆంధ్రప్రదేశ్‌కు కాకుండా తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లుగా(ట్రైనీ) పనిచేస్తున్న సృజన, శివశంకర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. సొంత జిల్లాలను శాశ్వత నివాసంగా తీసుకొని తమను ఏపీలో కొనసాగించాల్సి ఉన్నా... అందుకు విరుద్ధంగా తెలంగాణకు కేటాయించారని పిటిషనర్లు కోరారు.