విజయవాడ–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు 

Special Train for Vijayawada To Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ–సికింద్రాబాద్‌ (07711) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలి పారు. ఈ రైలు ఈ నెల 9న రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి ఉదయం6.45కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–గూడూర్‌ (82740) సువిధ రైలు 10వ తేదీ రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి ఉదయం 6.50కి చేరుకుం టుంది.సికింద్రాబాద్‌–మచిలీపట్నం (82743) సువిధ రైలు ఈ నెల 11న రాత్రి 9.40కి బయలుదేరి మరుసటి ఉదయం 6.05 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top