ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా

Special report to the state government on the status of the caste - Sakshi

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 

హైదరాబాద్‌: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం(టీపీవైఎస్‌) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌లో 27,033 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top