
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు.
నల్గగొండ: నల్లగొండ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. అయితే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టుకు స్థలమిచ్చి కేంద్రానికి లేఖ రాస్తే.. తాము మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని సదానంద గౌడ తెలిపారు.