డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట | Some relif to ded candidates | Sakshi
Sakshi News home page

డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

Dec 31 2017 2:47 AM | Updated on Aug 31 2018 8:34 PM

Some relif to ded candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష (టీఆర్‌టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖ లు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండా దర ఖాస్తులను స్వీకరించి, టీఆర్‌టీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పిటిషనర్ల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2007 తర్వాత డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్‌ కేటగిరీవారు ఇంటర్‌లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఇతరులు 45% మార్కు లు సాధించి ఉంటేనే ఎస్‌జీటీ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. ఇంటర్‌లో కనీస మార్కులు లేవని పలువురు టీఆర్‌టీ అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement