దబ్బనంలో దూరే పట్టుచీర | Silk sarees dure dabbananlo | Sakshi
Sakshi News home page

దబ్బనంలో దూరే పట్టుచీర

Nov 24 2014 2:38 AM | Updated on Sep 2 2017 4:59 PM

దబ్బనంలో దూరే పట్టుచీర

దబ్బనంలో దూరే పట్టుచీర

ఐదు మీటర్ల పొడవు, 30 గ్రాముల బరువు ఉండే ఈ పట్టు చీరను మగ్గంపై నేసి అబ్బుర పరిచారు.

నల్ల పరంధాములు వారసుడి మరో ప్రయోగం

సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ దబ్బనంలో దూరే పట్టుచీరను మరమగ్గంపై నేశారు. ఐదు మీటర్ల పొడవు, 30 గ్రాముల బరువు ఉండే ఈ పట్టు చీరను మగ్గంపై నేసి అబ్బుర పరిచారు. పదిహేను రోజులు శ్రమించి పట్టు దారంతో ఈ చీరను తయారు చేసి ఆదివారం ప్రదర్శించారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత నల్ల పరంధాములు తనయుడే విజయ్. అతను ఇటీవలే ఉంగరంలో దూరే చీరను నేశారు.

మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రాన్ని నేస్తూనే.. మరోవైపు కొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతున్నారు. నాన్న పరంధాములు స్ఫూర్తితో ఈ ప్రయోగాలు చేస్తున్నానని విజయ్ తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే మరికొందరికి శిక్షణ ఇస్తానని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement