70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | siddipet police caught ration rice bags | Sakshi
Sakshi News home page

70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Aug 26 2017 5:30 PM | Updated on Sep 12 2017 1:02 AM

లబ‍్ధిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు.

సాక్షి, సిద్దిపేట : లబ‍్ధిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జగదేవ్‌పూర్‌ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement