జిల్లాలో ‘షీ’ బృందాల విస్తరణ | She teams expansion in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో ‘షీ’ బృందాల విస్తరణ

May 16 2015 11:38 PM | Updated on Aug 14 2018 10:51 AM

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఈవ్‌టీజింగ్ వంటి వాటిని అరికట్టేందుకు షీ టీమ్‌లను విస్తరించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు.

సంగారెడ్డి క్రైం : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఈవ్‌టీజింగ్ వంటి వాటిని అరికట్టేందుకు షీ టీమ్‌లను విస్తరించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రపురం, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట పట్టణాలో ్ల పనిచేస్తున్న షీ టీమ్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం శిక్షణ  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు ఈ శిక్షణ  కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ సింగపూర్ పర్యటనలో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్ వంటివి జరుగకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులతో చర్చించి షీ టీం బృందాలను ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. 

అనంతరం కోర్డుకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, నమన్లు, వారెంట్లు తదితర విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ శిక్షణ  కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ రాంచెందర్, ఖాజామొయినుద్దీన్, షీ టీంలకు సంబంధించి 25 మంది సిబ్బంది పాల్గొన్నారు.

 ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అవసరం
 పుస్తకాలతో పనిలేకుండా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ విధానం అలవర్చుకోవాలని ఎస్పీ సుమతి సూచించారు. జిల్లా పోలీసు కల్యాణ మండపంలో శనివారం పోలీసు శాఖలోని వీపీఓలు, స్టేషన్ రైటర్లు, స్టేషన్ అధికారులకు ఒకరోజు శిక్షణ  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలతో ప్రజలకు సేవలందించాలన్నారు. కేసులను వెనువెంటనే రిజిస్టర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, ఐటీల్యాబ్ ఎస్‌ఐ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement