సాగర్ కళాశాలలో సైన్స్ సెంటర్ ప్రారంభం | Science center beginning in sagar college | Sakshi
Sakshi News home page

సాగర్ కళాశాలలో సైన్స్ సెంటర్ ప్రారంభం

Jul 29 2014 12:32 AM | Updated on Mar 28 2018 11:05 AM

విద్యార్థులు సైన్స్‌ను పుస్తకాల ద్వారానే కాకుండా ప్రయోగాత్మక కేంద్రాలతోనూ విజ్ఞానాన్ని పొందుతారని ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. సిద్ధు అన్నారు.

చేవెళ్ల రూరల్: విద్యార్థులు సైన్స్‌ను పుస్తకాల ద్వారానే కాకుండా ప్రయోగాత్మక కేంద్రాలతోనూ విజ్ఞానాన్ని పొందుతారని  ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. సిద్ధు అన్నారు. సోమవారం మండలంలోని ఊరేళ్ల సమీపంలోని సాగర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్  ఆధ్వర్యంలో డాక్టర్ పి.కె. నాగ్ మెమోరియల్ సాగర్ సైన్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ..  విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన పెంపొందించేందుకు, విజ్ఞాన సంబంధిత విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు ఈ సైన్స్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల  విద్యార్థుల వైజ్ఞానిక భావాలను ఉత్తేజపరచడానికి అవకాశం ఉందని చెప్పారు.  విద్యార్థులందరికి సైన్స్ సెంటర్ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. సైన్స్ సెంటర్‌ను మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పరిశీలించారు. కార్యక్రమంలో సాగర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ కార్యదర్శి డాక్టర్ డబ్ల్యూ రాంపుల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శివనారాయణ, డెరైక్టర్  జయరామిరెడ్డి, నాగశివానంద్, బీవీ రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రవికాంత్, సుదర్శన్ సింగ్, డబ్ల్యూ మాలతి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement