త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు | RTC fare hike in telangana, says mahender reddy | Sakshi
Sakshi News home page

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

May 21 2015 1:52 PM | Updated on Sep 3 2017 2:27 AM

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్టీసీలో ఆస్తుల పంపిణీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.

తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేని చెప్పారు. ఈ నెల 28  నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్నాయని మహేందర్రెడ్డి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement