తిప్పర్తిలో దొంగల బీభత్సం | Robbery in 3 villages | Sakshi
Sakshi News home page

తిప్పర్తిలో దొంగల బీభత్సం

Feb 8 2016 6:14 PM | Updated on Aug 30 2018 5:27 PM

తిప్పర్తి మండలంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

తిప్పర్తి (నల్లగొండ జిల్లా) : తిప్పర్తి మండలంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మాడ్గులపల్లి గ్రామంలో చిలుముల శ్రీనివాస రెడ్డి ఇంట్లో 60 వేల నగదు, 3 తులాల బంగారం దొంగిలించారు.

ఇండ్లూర్ గ్రామపంచాయితీ వడ్డెర గూడెంలో పల్లపు లింగయ్య ఇంట్లో 3 తులాల బంగారం, 40 తులాల వెండి, 10 వేల నగదును దొంగిలించారు. చెర్వుపల్లి గ్రామంలో తోట దగ్గర ఉన్న ఇంట్లో ఒక కలర్ టీవీని ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement