రెవెన్యూ అధికారులను  అరెస్టు చేయాలి | revenue officials should be arrested | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారులను  అరెస్టు చేయాలి

Jan 24 2018 6:19 PM | Updated on Aug 20 2018 4:27 PM

revenue officials should be arrested - Sakshi

మాట్లాడుతున్న నాయకులు

బెల్లంపల్లి : రామగౌడ్‌ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులను అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఆసాది మధు, పట్టణ అధ్యక్షుడు కుంబాల రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పల్ల మహేష్‌ అనే వ్యక్తికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం అందజేయడంతోనే రామగౌడ్‌పై అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, సర్పంచ్‌ తదితర అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నగేష్, రవిరాజ్, గోపాల్, శ్రీధర్, చక్రధర్, ఆకాష్, సమ్మయ్య పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement