చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ కుటుంబసభ్యులు | Revanth reddy family at charlapalli jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ కుటుంబసభ్యులు

Jul 1 2015 4:30 PM | Updated on Sep 3 2017 4:41 AM

చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ కుటుంబసభ్యులు

చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ కుటుంబసభ్యులు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు.

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు చర్లపల్లి జైలు వద్దకు వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు రావడంతో జైలు వద్ద హడావుడి నెలకొంది.

మంగళవారం హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు  హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేస్తూ తీర్పు కాపీని సవరించింది. తీర్పు కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ ఆర్డర్ కాపీలు తీసుకుని చర్లపల్లి జైలుకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement