మూడు రోజుల్లో వర్షాలు | rains in three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో వర్షాలు

Jun 17 2018 4:22 AM | Updated on Sep 4 2018 4:48 PM

rains in three days  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బిహార్‌ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేట్‌లో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement