అకాల వర్షం.. రబీ పంటలకు నష్టం

rabi seasons crop was destroyed due to unseasonal rain - Sakshi

జిల్లాలో మూడు రోజులుగా రాళ్ల వర్షం

దెబ్బతిన్న శనగ, గోధుమ, ధనియ, జొన్నపంటలు

ఆందోళనలో రైతులు

బజార్‌హత్నూర్‌(బోథ్‌) : జిల్లాలో మూడు రోజు లుగా రాత్రి సమయాల్లో కురుస్తున్న రాళ్ల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 40 శాతం శనగ పంటను కోసం మెదలుగా చేనులో ఆరబెట్టారు. ఉరుములు, మెరుపులతో గాలి బీ భత్సం, రాళ్ల వర్షంతో మెదల్లు కొట్టుకుపోవడం, తడిసిపోవడం జరిగింది. గింజలు నల్లబారి మెలకెత్తుతున్నాయి. మిగతా 60 శాతం పంట కోత దశలో ఉండడంతో రాళ్ల వర్షానికి నేలరాలాయి. గింజ నాణ్యత కోల్పోతే గిట్టుబా టు ధరలు రాక మళ్లీ నష్టపోయే పరిస్థితి వ స్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోథ్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొం డ మండలాల్లో 86 వేల ఎకరాల్లో రబీలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధమ పంటలు సాగు చేశారు. 

శనగ పంట దెబ్బతింది..

నాకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు శనగ, రెండెకరాల్లో కంది పంట వేసాను. శనగ పంట కోత దశలో ఉండడంతో రూ.4వేలు ఖర్చు చేసి కూలీలతో మెదల్లు వేసి ఆరబెట్టాను. మూడు రోజులుగా అకాల వర్షానికి మెదల్లు తడవడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నాలుగెకరాల శనగ పంట దెబ్బతింది. గింజరంగు మారేపరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
రైతు డుబ్బుల ముత్తన్నయాదవ్,  బజార్‌హత్నూర్‌

ప్రభుత్వం ఆదుకోవాలి

మండలంలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధుమ పంటలు సాగు చేశారు. మూడు రోజులుగా  రాళ్ల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గింజలు మొలకెత్తి, రంగుమారి నాణ్యత కోల్పోతున్నాయి. పంట దిగుబడిలో దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. రబీ పంటలకు గింజ నాణ్యతతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి.
రైతు కొడిమెల కాశీరాం, దేగామ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top