హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం | Heavy Rain At Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Jun 24 2023 11:58 PM | Updated on Jun 25 2023 12:08 AM

Heavy Rain At Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. వర్షానికి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, బేగంపేట, కోఠి, సికింద్రాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాలైన లింగంపల్లి, పటాన్‌చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement