ఆదుకోండి

Pune IBS Campus Student Waiting For Helping Hands - Sakshi

సాయం కోసం సరస్వతి పుత్రుడి ఎదురుచూపులు

పూనె ఐబీఎస్‌ క్యాంపస్‌లో సీటు సాధించిన మణిదీప్‌రెడ్డి

కోర్సు పూర్తి చేయాలంటే రూ.11.31లక్షలు

తన చదువుకు దాతలు సాయం చేయాలని విన్నపం  

దిల్‌సుఖ్‌నగర్‌: చదువు కోవాలనే తపన ఉన్నా అమ్మానాన్నలు లేకపోవటంతో అనాథ అయి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు మణిదీప్‌ రెడ్డి. వరంగల్‌ జిల్లా బచ్చన్న పేట మండలం, కేశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మణిదీప్, అతని సోదరుడు శశిధర్‌ రెడ్డిల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా వారిని ఎల్‌బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్‌ చేరదీసి వారి బాగోగులు చూస్తున్నారు. మణిదీప్‌ రెడ్డి టెన్త్‌ లో 80 శాతం మార్కులతో ఉప్పల్‌ సెయింట్‌ మార్క్స్‌ స్కూల్, ఇంటర్‌ 81 శాతంతో దిల్‌సుఖ్‌నగర్‌ ప్రణతి కాలేజీలో, డిగ్రీని 87 శాతంతో చిక్కడపల్లి అరోరా కళాశాలలో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం నారాయణగూడ ఐఎంఎస్‌ అకాడమీ ఉచిత కోచింగ్‌లో ఎంబీఏ కోర్స్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 90.8 శాతం మార్కులతో మహారాష్ట్ర పూనెకు చెందిన ఐబీఎస్‌ క్యాంపస్‌లో రెండేళ్ల కోర్స్‌కు సీట్‌ సాధించాడు. ప్రస్తుతం అనాథ విద్యార్థి గృహం మణిదీప్‌కు అండగా నిలిచినా.. కోర్స్‌ పూర్తి చేసేందుకు మొత్తం రూ.11.31 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దాతలు సహకరించి మణిదీప్‌కు అండగా నిలవాలని విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్‌ విన్నవిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top