ప్రాజెక్టులకు మహర్దశ | Projects to the boom | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు మహర్దశ

Jun 25 2015 11:36 PM | Updated on Sep 3 2017 4:21 AM

జిల్లాలోని ప్రాజెక్టులకు అదనంగా నిధులు మంజూరు చేయాలని రాష్ర్ట కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాత్రి జరిగిన

జూరాల : జిల్లాలోని ప్రాజెక్టులకు అదనంగా నిధులు మంజూరు చేయాలని రాష్ర్ట కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయి. కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లు రేట్లను పెంచాలని చేస్తున్న డిమాండ్‌కు గత ప్రభుత్వం జారీచేసిన జీఓ నెంబర్ 13కు మధ్య ఉపయోగకరంగా కేబినెట్ సబ్ కమిటీ అదనంగా రూ.483కోట్ల చెల్లింపులకు బుధవారం రాత్రి ఆమోదముద్ర వేసింది. జీఓ నెంబర్ 13 ప్రకారం కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లకు అనుగుణంగా ప్రాజెక్టుల అంచనాను సవరిస్తే ప్రభుత్వానికి రూ.565 కోట్ల అదనపు భారం అవుతుంది.

కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను కాకుండా అదనంగా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఒప్పించడంతో రూ.488 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులకు కావాల్సిన అదనపు నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులన్నీ తొలిగిపోనున్నాయి. ఇప్పటివరకు పనులను నత్తనడకన కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లు ఇక అన్ని దశల్లోనూ వేగవంతం చేసేందుకు వీలు కలిగింది. ఈ ఖరీఫ్‌లో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 3.71లక్షల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా జూలై చివరి నాటికి పనులను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ కీలక సమయంలో ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు కాకుండా అదనంగా భారాన్ని భరించేందుకు కాంట్రాక్టర్లను ఒప్పిం చి ఆమోదం తెలిపారు.

 దీంతో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీళ్లివ్వాల్సిన డిస్ట్రిబ్యూటరీలు, అక్విడక్టులు, ఫీల్డ్ ఛానల్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఖరీఫ్‌లో నెట్టెంపాడు పరిధిలో 68వేల ఎకరాలు, కల్వకుర్తి పరిధిలో 1.60లక్షల ఎకరాలు, భీమా పరిధిలో 96వేల ఎకరాలు, కోయిల్‌సాగర్ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్ణరయించారు. ఈ లక్ష్యం మేరకు కాంట్రాక్టర్లతో అధికారులు పనులు చేయించగలిగితే జిల్లాలో కొత్తగా ఆయకట్టు ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement