22న నగరానికి రాష్ట్రపతి కోవింద్‌

President of India to visit Hyderabad on Dec 22nd - Sakshi

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిం ద్‌ రాష్ట్ర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో ఆయ న బస చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ అధికా రవర్గాలు సూత్రప్రాయంగా ఖరారు చేసిన షెడ్యూల్‌ రాష్ట్ర ప్రభుత్వా నికి అందింది. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బొల్లారం వస్తున్నారు. రాష్ట్రపతి ఈ నెల 26 వరకు ఇక్కడ గడపనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top