
బాండ్ల రూపంలోనే పీఆర్‌సీ బకాయిలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్‌లో భాగంగా 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవ రి 28 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్‌లో భాగంగా 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవ రి 28 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఐదేళ్ల తరువాత వాటిని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. పీఆర్‌సీ అమలుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానమిచ్చారు.
పెనషనర్లకు ప్రయోజనాలు కల్పించేందుకు 2013 జులై 1 నుంచి 2014 జూన్ 1 వరకు నోషనల్‌గా 10వ పీఆర్‌సీని అమలు చేస్తామని వివరించారు. సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్), హెల్త్ కార్డుల అమలుపై స్పష్టత ఇవ్వాలని గణేష్ గుప్తా (టీఆర్‌ఎస్) మంత్రిని కోరగా పీఆర్‌సీ జీఓలు ఎప్పుడు జారీ చేస్తారని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని మోజాంఖాన్ (మజ్లిస్) ప్రశ్నించారు.