ఎన్‌కౌంటర్ మృతులకు భద్రాద్రిలో పోస్టుమార్టం | post-mortem on the deceased to encounter bhadradri | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ మృతులకు భద్రాద్రిలో పోస్టుమార్టం

Jun 14 2015 12:58 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులకు పోలీసు బందోబస్తు మధ్య శనివారం భద్రాచలం ....

{పత్యేక హెలికాప్టర్ ద్వారా
ఆసుపత్రికి తరలింపు
పోలీసు బందోబస్తు నడుమ శవపరీక్షలు
 

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులకు పోలీసు  బందోబస్తు మధ్య శనివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.  శనివారం  మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చా రు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25), ఏపీలోని చింతూరు మండలం లంకపల్లికి చెందిన కూరం జోగి అలియాస్ సోనీ(22), ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా చిన్నతర్రంకి చెందిన మడకం దేవి అలియాస్ కమల(23)గా పోలీసులు గుర్తిం చారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు.

పోలవ రం నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడు నెలల కాలం గా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. కూరం జోగి ఏరియా కమిటీ మెం బర్‌గా కొనసాగుతుండ గా, మడకం దేవి మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు ప్రొటెక్షన్‌సెల్‌లో పనిచేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

 ‘వివేక్‌కు మావోలతో సంబంధాలు లేవు’
 సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో సం బంధాలు లేవని  వివేక్ తండ్రి యోగానందాచార్యు లు స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆది నుంచి స మాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా,
 ఎన్‌కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement