మావోయిస్టుల డంప్ స్వాధీనం | police to take over the Maoists dump | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల డంప్ స్వాధీనం

Jul 2 2014 2:09 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టుల డంప్ స్వాధీనం - Sakshi

మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం అటవీ ప్రాంతంరామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసు లు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం బీరల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసు లు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాంబు డిస్పోజబుల్, సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు బీరల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా టేకు, వెదురు చెట్ల మధ్యన డంప్ వెలుగు చూసింది. 

నాలుగు టిఫిన్ బాక్స్‌లు, 303 తపంచాలు రెండు, పాయింట్ 22 తుపాకీ, వాటి తూటాలు, హ్యాండ్ గ్రేనెడ్స్ రెండు, వెబ్‌బెల్ట్స్ 23, విజిల్స్ 23, ఒక ఎయిర్ ఫిస్టల్, ఏకే 47, 303,  8ఎంఎం తూటాలు 44, విప్లవ సాహిత్యం పోలీసులకు పట్టుబడ్డాయి. వీటిని సుమారు ఐదేళ్ల క్రితం మావోయిస్టు ఆదిలాబాద్ ఏరియా కమి టీ అగ్ర నేతలు దాచిపెట్టి ఉంటారని అడిషనల్ ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement