క్లిక్‌.. లాక్‌

Photographers Loss With Lockdown in Wedding Season Medak - Sakshi

ఉపాధి కోల్పోతున్న వీడియో, ఫొటో గ్రాఫర్లు

సీజన్‌లో దెబ్బతీసిన లాక్‌డౌన్‌

ఝరాసంగం(జహీరాబాద్‌): ఒక్క క్లిక్‌తో వచ్చే రూపానికి తుది మెరుగులు దిద్దుతారు. మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిల పరుచుకునేలా అందమైన ఫోటోల్లో వాటిని బందిస్తుంటారు. ఏడాదంతా ఒక ఎత్తతైతే ఈ సమ్మర్‌ సీజన్‌ వీరికి మరో ఎత్తు. ఈ మూడు నెలల్లో ఫోటో, వీడియో గ్రాఫర్లు బీజీగా ఉంటారు. పెళ్లిళ్ల సీజన్‌ వారికి పెద్ద పండుగతో పాటు మంచి ఉపాధి సమయం. కాని ఈ సంవత్సరం మాత్రం సీజన్‌ ప్రారంభం నుంచి కరోనా ప్రభావం పడింది. షాపు యజమానులతో పాటు సిబ్బంది కూడా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కోవిడ్‌(19) వైరస్‌ వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో ప్రజలు ఇంటి వద్దే ఉండిపోతున్నారు. ఫలితంగా శుభకార్యాలు, పెండిళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఈ వృత్తినే నమ్ముకున్న ఫొటో, వీడియో గ్రాఫర్లకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురయ్యయి.

ఉపాధి ఎఫెక్ట్‌
జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఫొటో, వీడియో గ్రాఫర్లు ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.  ఫోటో, వీడియో గ్రాఫర్లకు మంచి సీజన్‌  చేజారుతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పటం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా బుకింగ్‌లు చాలా వాయిదా పడినట్లు పేర్కొంటున్నారు.

ఆర్థికంగా ఇబ్బందులు
లాక్‌డౌన్‌తో ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఉపాధికి ఎఫెక్ట్‌ పడింది. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్‌లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాని కరోనా లాక్‌డైన్‌తో ఉపాధికి ఎఫెక్ట్‌ పడింది.   –వీరన్న, ఫొటో గ్రాఫర్, ఝరాసంగం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top