'పాలమూరు' పనులను అడ్డుకున్న ప్రజలు | people protests at palamuru ethipothala project | Sakshi
Sakshi News home page

'పాలమూరు' పనులను అడ్డుకున్న ప్రజలు

Jun 11 2016 12:42 PM | Updated on Mar 22 2019 2:57 PM

మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బండరాయిపల్లి గ్రామస్తులు శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్వుతున్న కాలువ పనులను అడ్డుకుని ధర్నా చేశారు.

మహబూబ్‌నగర్  : మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బండరాయిపల్లి గ్రామస్తులు శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్వుతున్న కాలువ పనులను అడ్డుకుని ధర్నా చేశారు. అందులోభాగంగా అక్కడే వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు.

ముంపు గ్రామమైన బండరాయిపల్లె గ్రామస్తులకు సరైన పరిహారం, పునరావాస ఏర్పాట్లు చేయకుండానే కాలువ తవ్వకం పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు  హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement