
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సభలోని అని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ తెలిపారు. సభాపతి ప్రకటన అనంతరం బాధ్యతలు చేపట్టిన.. పద్మారావుకు సభలోని సభ్యులందరూ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పద్మారావు పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సభావతి ప్రకటన అనంతరం కేసీఆర్ ఆయనను దగ్గరుండి తీసుకెళ్లి స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విపక్ష పార్టీ సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.