
హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో అమ్మాయిల్ని వేధించిన కేసులో అరెస్టైన కార్పొరేటర్ తనయుడు అభిషేక్‌గౌడ్‌పై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఓ సారి ఇలాంటి కేసులోనే కటకటాలపాలైనా తీరు మార్చుకోకుండా బెయిల్ పై వచ్చి మళ్లీ తన వక్రబుద్ధితో అమ్మాయిలను ఏడిపిస్తున్న అభిషేక్‌గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 140వ డివిజన్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తనయుడు కావడంతోనే అభిషేక్‌ను పోలీసులు ఏమి అనడం లేదని తక్షణమే కార్పొరేటర్ తన పదవికి రాజీనామ చేయాలని మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు.