బురిడీ కొట్టించి ఆన్‌లైన్ షాపింగ్ | online fraud in nagar kurnool | Sakshi
Sakshi News home page

బురిడీ కొట్టించి ఆన్‌లైన్ షాపింగ్

Jul 3 2015 10:35 AM | Updated on Sep 3 2017 4:49 AM

ఖాతాదారులను బురిడీ ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్): ఖాతాదారులను బురిడీ ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో బయట పడింది. వివరాలు.. 'ఢిల్లీ భారతీయ స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఏటీఎం సెక్యూరిటీ కోసం కార్డు పైన ఉండే నంబర్ల వివరాలు చెప్పండి' అంటూ ఈ నెల 1న ఖాతాదారులకు ఫోన్ వచ్చింది.

ఆ నంబర్ల సహాయంతో మోసగాళ్లు షాపింగ్ చేయటంతో ఖాతాదారుల జేబుకు చిల్లుపడింది. మలిశెట్టి శేఖర్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.45 వేలు, గోపాల్‌కృష్ణ, మరో వ్యక్తి (పేరు తెలియదు) ఖాతా నుంచి రూ.55వేలు మాయమైంది. ఆ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదు. తెలిసిన వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement