మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఉదయం సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఉదయం సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. లింగాల మండలం దత్తారం వద్ద ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రాణాలు కో్ల్పోయారు.
నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరు లో జరిగిన మరో ప్రమాదంలో ఆగిఉన్న ట్రాక్టర్ ను ఆటో ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.