ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తున్న వన్‌గ్రాం గోల్డ్ నగలు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు ఓవైపు.. చైన్ స్నాచర్ల బెడద మరోవైపు.. దీంతో బంగారు నగలు దరించి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతామనే భరోస మహిళలకు లేకుండా పోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు పెళ్లిల్లకు వెళ్లాలంటే నగలు లేకుండా వెళ్లడం ఎలా..? ఈ ప్రశ్నకు ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తున్న వన్‌గ్రాం గోల్డ్ నగలు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని ఈ అభరణాలపై మగువలే కాక కళాశాల యువత కూడా మక్కువ చూపుతున్నారు. ఈ నగలను ధరిస్తే స్వచ్చమైన బంగారు నగలు దరించినట్టే ఉండడం వల్ల ఇవి ఇంతటి ఆదరణ పొందుతున్నాయి. ఈ వన్ గ్రాం గోల్డ్ నగలు నగరంలోని బేగం బజార్, చార్మినార్ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి.