‘ఆర్మూర్ లిడ్‌క్యాప్’నకు మహర్దశ | one and only industry elected in telangana development | Sakshi
Sakshi News home page

‘ఆర్మూర్ లిడ్‌క్యాప్’నకు మహర్దశ

Aug 22 2014 3:03 AM | Updated on Sep 2 2017 12:14 PM

తెలంగాణ రాష్ట్రంలో పది లిడ్ క్యాప్‌లు (చర్మ పరిశ్రమలు) ఉంటే అందులో ఆర్మూర్ లిడ్ క్యాప్‌..

ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో పది లిడ్ క్యాప్‌లు (చర్మ పరిశ్రమలు) ఉంటే అందులో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను ఒక్కదానిని మాత్రమే అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా సంస్థ తెలంగాణ ప్రాజెక్టు డెరైక్టర్ అరవింద్ పట్వారి తెలిపారు. గురువారం పట్టణంలోని లిడ్ క్యాప్ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ సైదతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్మూర్ ప్రాంతం రోడ్డు, రైల్వే రవాణా పరంగా కేంద్రంగా ఉండటం వల్ల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ఎంపిక చేశామన్నారు.

ఈ ఏడాది జనవరి 15న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫైనల్ అ ప్రూవల్ లభించిందన్నారు. 2016లోగా  10 కోట్ల 87 వేలతో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులలో రూ. 7 కోట్ల 40 లక్షల 7 వేలు కేంద్ర ప్రభుత్వం,  రూ. 2 కోట్ల 60 లక్షల 80 వేలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రెండేళ్లలోగా పరిశ్రమకు అవసమయ్యే అన్ని మౌలిక స దుపాయాలను కల్పిస్తామన్నారు. ఆర్మూర్ లిడ్ క్యాప్‌లోని 28 ఎకరాల ఒక గుంట స్థలంలో ప్రహరీ, విద్యు త్ దీపాలు, మురికి కాలువలు, కాన్ఫరెన్స్ హాల్, రా మెటీరియల్ భద్ర పరిచే గది, ఎగ్జిబిషన్ సెల్ నిర్మాణా లు చేపడతామన్నారు. 700 గజాల విస్తీర్ణంతో ప్లాటు ్లగా మార్చి 89 యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

 15 వందల మందికి ఉపాధి
 ఈ లిడ్ క్యాప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 89 మందిని ఎంపిక చేసి ఈ 89 యూనిట్లను నిర్వహిస్తామన్నారు. తద్వారా సుమారు 15 వందల మందికి ప్ర త్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. లెదర్‌తో బ్యాగు లు, షూ, చెప్పులు తదితర వస్తువుల తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తామన్నారు. అయితే ఈ వస్తువులకు సరఫరా చేసే రా మెటీరియల్ తయారీ కీలకమైందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే లెదర్‌ను శు భ్రం చేసే ప్రాజెక్టు అందుబాటులో ఉందన్నారు. అలాంటి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడానికి లిడ్ క్యాప్ ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement