రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రొఫెసర్‌గా కనీస సర్వీసు ఐదేళ్లకు కుదింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆచార్యునిగా ఉండాల్సిన కనీస అనుభవ పరిమితి ఇప్పటిదాకా పదేళ్లుండగా దాన్ని ఐదేళ్లకు కుదించారు. అర్హులు నిర్దేశిత నమూనాలో సమగ్ర వివరాలతో బయోడేటాను ధ్రువీకరణ పత్రాలతో సహా జనవరి 8లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చేరేలా పంపాలి. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకుందుకు అవసరమైన అర్హతలు, ఇతర వివరాలకు tsche.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


