ముల్కనూర్ బ్యాంకు పనితీరు భేష్ | Mulkanoor bank is good, says Bhuma nagi reddy | Sakshi
Sakshi News home page

ముల్కనూర్ బ్యాంకు పనితీరు భేష్

May 18 2015 4:01 AM | Updated on Sep 3 2017 2:14 AM

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ముల్కనూర్ బ్యాంకు పనితీరు అభినందనీయమని ఏపీ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు.

ఏపీ పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి
 భీమదేవరపల్లి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ముల్కనూర్ బ్యాంకు పనితీరు అభినందనీయమని ఏపీ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండ లం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకును ఆదివారం ఆయన పరిశీలించారు. బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జనరల్ మేనేజర్ మార్పాటి లక్ష్మారెడ్డి బ్యాంకు పనితీరును పవర్ పారుుంట్ ప్రజంటేషన్ ద్వారా భూమాకు వివరించారు. అనంతరం బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను రికార్డుల ద్వారా చూపించారు. బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారాబాయిల్డ్ రైస్‌మిల్, కాటన్ జిన్నింగ్ ప్లాంట్, సూపర్‌బజార్, పెట్రోల్ బంక్‌లను పరిశీలించారు. అనంతరం ముల్కనూర్ స్వకృషి డెయిరీని పరిశీలించారు. డెరుురీ పనితీరును అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి భూమా నాగిరెడ్డికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement