దివ్యాంగులకు నా నిధులిస్తా

mp boora narsaiah goud told am with handicappeds - Sakshi

ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

సాక్షి, యాదాద్రి : దివ్యాంగులు మానసికంగా కృం గిపోకుండా  నైపుణ్యం పెంపొందించుకుని పట్టుదలతో పైకి ఎదగాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌  అన్నారు. కేంద్ర ప్రభుత్వం  కృత్రిమ ఉపకరణాల తయారీ సంస్థ (అలిమ్‌కో), జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభు త్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  దివ్యాంగుల కోసం తన పార్లమెంట్‌ నిధులను కేటాయిస్తానన్నారు. పా ర్లమెంట్‌లో చర్చించి ఎలక్ట్రిక్, మోటరైట్‌ వాహనా లు వికలాంగులకు అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.

ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక పరికరాలు సమకూర్చుకోలేని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు అందించడం పట్ల అభినందించారు. వికలాంగులు ఉపకరణాలను సద్వి నియోగపర్చుకోవాలన్నారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మాట్లాడుతూ తన సర్వీసు కాలంలో సదరమ్‌ క్యాంపులకు రూపకల్పన చేసే అవకాశం తన కు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నా రు.

ఎంపీ ప్రత్యేక చొరవతో 467 మంది లబ్ధిదారులకు అలిమ్‌కో సంస్థ ద్వారా రూ. 32లక్షల ఖర్చుతో ఉపకరణాలు ఉచితంగా అందించడం పట్ల కలెక్టర్‌ అభినందించారు.డీఆర్‌డీఓ వెంకట్రావ్‌ మా ట్లాడుతూ జిల్లాలో 12,874 మంది వికలాంగులకు ప్రతినెలా రూ.2.27కోట్లు పింఛన్‌  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 32 సదరం క్యాంప్‌లు నిర్వహించి 3,043 మంది వికలాంగులకు ధృవపత్రాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసిన కార్యక్ర మంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, డీఆర్‌డీఓ వెంకట్రావ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య, ఏపీఎం రమణ తదితరులు ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top