‘గుట్ట’ వద్ద మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు | 'Mound' more spiritual centers at | Sakshi
Sakshi News home page

‘గుట్ట’ వద్ద మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు

Dec 20 2014 6:26 AM | Updated on Nov 9 2018 6:22 PM

యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు....

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. రూ. మూడు వేల కోట్ల పెట్టుబడితో యాదగిరిగుట్ట సమీపంలో  250 ఎకరాల్లో సిద్ధక్షేత్రధామ్ నిర్మించే ప్రతిపాదనలను సహ్యోగ్ ఫౌండేషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చింది.

శుక్రవారం సంస్థ ప్రతినిధులు జయేష్ దేలివాల, అశోక్‌ధోబి, సురేష్‌షా, రజనీకాంత్‌షా తదితరులు సచివాలయంలో సీఎంను కలిసి ఈ వివరాలు అందించారు. ఈ సంరద్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఆ నిర్మాణాలకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వారికి హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement