చనిపోయిన శిశువును కుక్కలు పీక్కుతిన్న హృదయవిదారక ఘటన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో సోమవారం చోటుచేసుకుంది.
మెదక్ (సంగారెడ్డి) : చనిపోయిన శిశువును కుక్కలు పీక్కుతిన్న హృదయవిదారక ఘటన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ మహిళ ఆదివారం మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే శిశువు చనిపోవడంతో పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడవేసి వెళ్లిపోయింది.
ముళ్లపొదల్లో పడివున్న శిశువు మృతదేహాన్ని సోమవారం వీధికుక్కలు పీక్కుతింటుండటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.