రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేద్దాం  | MLC Ramchander Rao Comments On KCR | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేద్దాం 

Sep 15 2018 9:36 PM | Updated on Oct 8 2018 5:07 PM

MLC Ramchander Rao Comments On KCR - Sakshi

 కోస్గిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంచందర్‌రావు  

కోస్గి (కొడంగల్‌) : ప్రధాని మోదీకి భయపడే కేసీఆర్‌ ముందస్తూ ఎన్నికలకు వెళ్లారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడంతోపాటు పాలమూర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే శంఖారావం సభతో పార్టీ సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు. కోస్గిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోలాయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్‌కు సాధ్యం కాలేదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహితంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని వెల్లడించారు.

కాగా, శనివారం పాలమూరులోజరిగే శంఖారావ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్య అథితిగా వస్తున్నారని, ఈ సభకు ప్రతీ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక శివాజీ చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్సీ పూజలు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, మండల అధ్యక్షుడు నారాయణ, నాయకులు గందె వెంకటయ్య, వెంకట్‌నర్సిములు, శ్రీకాంత్, కూర వెంకటయ్య, మదన్‌ పాల్గొన్నారు. 

బీజేపీతోనే అభివృద్ధి 
మద్దూరు (కొడంగల్‌) : బీజేపీ ద్వారానే దేశంతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావ్‌ నామాజీ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని గ్రామపంచాయతీలకు కేంద్రప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉచితంగా 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర పెంచామని గుర్తుచేశారు. కాగా, శనివారం పాలమూరులో జరిగే ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్, లాలప్ప పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement